![]() |
![]() |

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి "తెలుసు కదా" మూవీ నుంచి రాశి ఖన్నా, శ్రీనిధి వచ్చారు. వీళ్ళు ఈ ఎపిసోడ్ కి అదనపు ఆకర్షణగా నిలిచారు. ఐతే వీళ్లకు ఫ్యూచర్ హజ్బెండ్స్ రావాలి అనే విషయం మీద శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది. ఆ టాస్క్ పేరు "తెలుసుకోవాలి కదా" అంది. అందులో రాశి ఖన్నా తన కాబోయే భర్తలో ఈ క్వాలిటీస్ ఉండాలని చెప్పిందిలా. "35 - 38 మధ్య వయసు ఉండాలి, 5 '9 నుంచి 6 '3 మధ్య అబ్బాయి హైట్ ఉండాలి అలాగే 85 కిలోల లోపు ఉండాలి అలాగే బాడీ ఫిట్ గా ఉండాలి" అని చెప్పింది." ఇక ఆస్తులు తనకు ఉన్నాయి కాబట్టి వచ్చే అబ్బాయికి ఆస్తులు లేకపోయినా పర్లేదు అని చెప్పింది.
అలాగే యాక్టర్ ఐనా డాక్టర్ ఐనా కానీ పర్లేదని కానీ ఏడాదికి కోటి రూపాయలు సంపాదించాలని కండిషన్ పెట్టింది. ఇక హాబీస్ విషయానికి వస్తే ట్రావెలింగ్ అంటే తనకు ఇష్టం కాబట్టి ట్రావెలింగ్ చేస్తూ ఉండాలి అలాగే ట్రావెలింగ్ చేయని టైములో రీడింగ్ కూడా హాబీగా ఉండాలని చెప్పింది. ఇక తనకు కాబోయే అబ్బాయి ఫేస్ ఫీచర్స్ స్మార్ట్ గా ఉనాడాలని కళ్ళు లోతుగా ఉండాలని షార్ప్ గా ఉండాలి అని చెప్పింది. ఆయన కళ్ళు చూస్తూ నేను అలా మైమరిచిపోవాలి అలాగే నాకు బ్యూటిఫుల్ బేబీస్ కావాలి అందుకే అని చెప్పింది రాశిఖన్నా.
![]() |
![]() |